పీఎం విశ్వకర్మ యోజన కింద ఏలూరు జిల్లాలో 72, 873 దరఖాస్తులు అందాయని ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఏలూరు కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. వచ్చిన దరఖాస్తుల్లో 15, 185 మందిని సిఫార్సు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో కె. సుబ్బారావు, డీఆర్డీఏ పీడీ విజయరాజు తదితరులు పాల్గొన్నారు.