పోలవరం మండలం ఎల్ ఎం డి పేటలో మంగళవారం ఏర్పాటు 5 వరోజు గ్రామసభలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తుల వద్ద నుండి పలు వినతులను, ఫిర్యాదులను స్వీకరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 100 రోజులలో ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు పలు హామీలని నెరవేర్చామన్నారు.