ఏలూరు జిల్లాలో గణపతి లడ్డూ రికార్డు స్థాయి ధర పలికింది. జిల్లాలోని జీలుగుమిల్లి మండలం పి. అంకంపాలెం గ్రామంలో వినాయక యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా గురువారం రాత్రి స్వామి వారి 20 కేజీల లడ్డూను వేలం వేయగా రూ. 3. 80, 000కు 14 మంది కమిటీ సభ్యులు దక్కించుకున్నారు.