ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిని ఆంధ్ర రీజియన్ జైళ్ల శాఖ డి. ఐ. జి. రవి కిరణ్ కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. వారికి ఆలయ సిబ్బంది వెంకటరాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఆలయ జ్ఞాపిక అందించారు. అనంతరం డిఐజి కుటుంబ సభ్యలతో కలిసి వీరేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక పోలీసులు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.