టి. డి. పి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన భవిష్యత్ గ్యారెంటీ మేనిఫెస్టో ప్రతి కుటుంబానికి ఉపయోగపడుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ సభ్యురాలు గంగిరెడ్ల మేఘలాదేవి అన్నారు. శుక్రవారం మహిళలతో కలిసి ఆమె ఇంటింటా భవిష్యత్ గ్యారెంటీ మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించారు. ఈ అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పుదాం అంటూ, ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. కె రమ, అర్. మదన్, పాల్గొన్నారు.