ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని సీతారామ నగరానికి చెందిన సంతోశ్ (26) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మంగళవారం మృతి చెందాడు. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న సంతోశ్ పొలంలో విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు తెలిపారు. అతడి ఒంటిపై గాయాలున్నాయని, పురుగుమందు తాగి ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.