భారత రాజ్యాంగం గొప్పతనం, విశిష్టత ప్రతి ఒక్కరికీ తెలియాల్సిన అవసరం ఉందని జిల్లా జాయింట్ కలెక్టరు టి. రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం భీమవరంలోని యస్ఆర్ కెఆర్ ఇంజనీరింగ్ కళాశాల సమావేశ మందిరంలో 75వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను కళాశాల విద్యార్థులతో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.