తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో మంగళవారం 104 వాహనం ద్వారా ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ కిషోర్ ఆధ్వర్యంలో గ్రామంలో పర్యటించిన వైద్య బృందం పలువురికి మధుమేహం, రక్తపోటు పరీక్షలు నిర్వహించి మందులు అందచేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎస్ శ్రీరామ్ మూర్తి, డిఈఓ సాయిరాం వెంకటేష్, ఎంఎల్ హెచ్ పీ శాంతి, ఎంపీ హెచ్ ఏ రఘు, పైలట్ ఆనంద్, ఆశ సిబ్బంది, అంగన్వాడీలు పాల్గొన్నారు.