నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణరావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం సంతాప సభ ఏర్పాటు చేశారు. కార్యాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులు, గ్రామాల సచివాలయ ఉద్యోగులు ఎంపీడీవో రమణారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 2 నిముషాల పాటు మౌనం పాటించారు.