భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మనుమడు గ్రంధి షణ్ముఖ్ విజయవాడ ముంపు బాధిత ప్రజలను ఆదుకోవడానికి తనవంతుగా రూ 20, 850 చెక్కును అందచేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు నాగరాణిని గురువారం కలిసి చెక్కు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడలో కొన్ని డివిజన్లలో ప్రజలు నష్టపోయారని వారిని ఆదుకునేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు.