రేపే సామాజిక పింఛన్ల పంపిణీ: కలెక్టర్

51பார்த்தது
రేపే సామాజిక పింఛన్ల పంపిణీ: కలెక్టర్
ప. గో జిల్లాలో సెప్టెంబర్ నెల పెన్షన్లు ఆగస్టు 31వ తేదీనే పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబరు 1న ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 2, 31, 075 మందికి రూ. 96. 95 కోట్ల నగదు పంపిణీ చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఆగస్టు 31 నాడే 100 శాతం పింఛన్ల పంపిణీని టార్గెట్ గా పెట్టుకున్నామన్నారు.

தொடர்புடைய செய்தி