పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం నడిపూడి గ్రామానికి చెందిన పూరిళ్ల వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గంగాధర్ రావు తెలిపారు. వివరాల్లోకి వెళితే వెంకటేశ్వరరావు 20 యూనిట్ల బొండు ఇసుక అక్రమంగా లారీలు, ట్రాక్టర్లపై తరలిస్తున్నారని వీఆర్వో చిన వెంకట్రావు ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.