గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో యలమంచిలికి చెందిన రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ ప్రగడ నాగేశ్వరావు పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు పలు సమస్యలపై అర్జీలను అందజేశారు. వాటిని పరిశీలించిన నాగేశ్వరరావు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.