స్వచ్ఛతా హీ కార్యక్రమంలో విశాఖకు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం తగ్గింది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా మచిలీపట్నంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో జివిఎంసి కమిషనర్ సంపత్ కుమార్ ఈ అవార్డును అందుకున్నారు. గత నెల 17వ తేదీ నుంచి బుధవారం వరకు నాలుగు రకాలుగా స్వచ్ఛత హీ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం పై సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.