ప్రమాదాలు జరగకుండా భద్రతా ప్రమాణాలను కార్మికులు పాటించాలని జాతీయ విపత్తు స్పందన దళం 10వ బెటాలియన్ కమాండర్ వై. సత్యనారాయణ సూచించారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై శనివారం పరవాడలో ఆయన అవగాహన కల్పించారు. పరవాడ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, సువెన్ ఫార్మా కంపెనీల్లో సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఫైర్ డ్రిల్, ప్రాథమిక చికిత్స గురించి వివరించారు.