ఉమ్మడి విశాఖ జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షల నేపథ్యంలో ఆదివారం మేఘాద్రి గడ్డ రిజర్వేయర్ గరిష్ట స్థాయికి చేరుకుంది. రైవాడ, పెద్దేరు, కోణం, తాండవ, కళ్యాణపు లోవ జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ వుండటంతో చింతపల్లి ప్రాంతం, బలపం పంచాయితీలో వాగులు పొంగి పొర్లుతున్నాయి.