వేములపూడిలో డ్రోన్ ద్వారా పురుగు మందు పిచికారి

63பார்த்தது
నర్సీపట్నం మండలం వేములపూడిలో శనివారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తెగుళ్లు ఆశించిన వరి పొలంలో డ్రోన్ ద్వారా పురుగు మందును పిచికారి చేశారు. గ్రామానికి చెందిన యువరైతు బోళెం గోపాత్రుడు డ్రోన్ ఆపరేట్ చేసి 35 ఎకరాల విస్తీర్ణంలో గల వరిపోలంలో పురుగు మందులు స్ప్రే చేశారు. ఈ విధానంలో ఖర్చు తక్కువ అవుతుందని ఆయన తెలిపారు. అంతేకాకుండా సమయం కూడా ఆదా అవుతుందన్నారు.

தொடர்புடைய செய்தி