భూ సమస్యల పరిష్కారానికే గ్రామ సభలను నిర్వహిస్తున్నట్లు నాతవరం తహశీల్దార్ ఏ. వేణుగోపాల్ తెలిపారు. శుక్రవారం మండలంలో ఊటమళ్ళ గ్రామంలో రీ సర్వేకు సంబంధించి భూ సమస్యలపై గ్రామ సభ నిర్వహించారు. మండలంలో 31 పంచాయతీల పరిధిలో 18 రెవెన్యూ గ్రామాలలో రీ సర్వే జరిగిందని, ఆయా గ్రామాలలో గ్రామ సభలు నిర్వహిస్తున్నామన్నారు. భూ సమస్యలపై దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పారు.