ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష అధికారులతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు సోమవారం స్పీకర్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అనకాపల్లి ఈఈ నరసింగరావు, నర్సీపట్నం డివైఈఈ సుబ్బలక్ష్మిపాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గంలోని పాఠశాలల ప్రహరీ గోడల కోసం ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి మూడు మండలాల్లో 29 పనుల కోసం 3కోట్ల 82 లక్షలరూపాయలు మంజూరయ్యాయని వీటితో పాఠశాలల ప్రహరీ గోడలునిర్మిస్తామన్నారు.