నర్సీపట్నం న్యాయస్థానాల సముదాయంలో గురువారం జాతీయ బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి పి. షియాజ్ ఖాన్ విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చట్టాల మీద అవగాహన కల్పించారు. విద్యార్థులకు కావలసిన సమాచారం అందజేయడానికి మండల న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బార్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.