దేవరపల్లి నుండి వాలబు వెళ్లే ప్రధాన రహదారి నిర్మించాలని సిపిఎం నాయకుడు బీటీ దొర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఎంపీడీవోకి వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ నిత్యం దేవరపల్లి హై స్కూల్ కి వెళ్లే విద్యార్థులు గాని, గర్భిణీ స్త్రీలు గాని, రహదారి లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. అలాగే సరియా జలపాతంకు సందర్శకులు తాకిడి మరింత పెరగాలంటే ఈ రోడ్డు నిర్మాణం ఎంతో ముఖ్యమన్నారు.