దేవరాపల్లి మండలాన్ని సమగ్ర అభివృద్ధి చేయాలని సిపిఎం మండల మహా సభ డిమాండ్ చేసింది, శనివారం దేవరాపల్లిలో సిపిఎం పార్టీ మండల మహసభ షేక్ అప్పాసాహిబ్ అద్యక్షతన జరిగింది. ముఖ్య అతిదిగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కె. లోకనాధం పాల్గోని మాట్లాడారు. హైడ్రోపవర్ ప్లాంట్ అనుమతులు ఇస్తే గిరిజనులు, రైతులు ఎక్కడికక్కడ అడ్డు కోవాలని పిలుపు నిచ్చారు. అదాని కన్నుపడిన ప్రాంతం అంతా నాశనం అవుతుందని తెలిపారు.