ప్రజలు కడుతున్న పన్నులతో కార్పొరేటర్లు అధ్యయన యాత్రలు చేయడం సరికాదని సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు గురువారం విమర్చించారు. విశాఖలో చాలా సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించకుండా ఇలా విహారయాత్రలు చేయడం ఎంతవరకు సబవన్నారు. గతంలో అధ్యయన యాత్ర వల్ల నగరానికి ఒరగూరేందేమీ లేదని, ప్రజల నిధులతో కార్పొరేటర్లు ఇలా విహార యాత్రలకు వెళ్లడం ఇకనైనా మానుకోవాలన్నారు.