రాష్ట్ర పర్యటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం విశాఖ నగరంలోని తెన్నేటి పార్కుతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం అనాలోచిత విధానాలు అక్రమాల వల్ల పర్యాటక అభివృద్ధి కుంటుప డిందని అన్నారు. తమ ప్రభుత్వం హయంలో పర్యటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు.