చోడవరం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల 22 ప్రైవేట్ మద్యం దుకాణాలకు ఇప్పటివరకు 160 దరఖాస్తులు. అందినట్లు ఎక్సైజ్ సిఐ కె. పాపు నాయుడు మంగళవారం మీడియాకు తెలిపారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రంతో దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగిస్తుందని చెప్పారు. వాటిలో భాగంగా చోడవరం మండల పరిధిలో గల 8 మద్యం దుకాణాలకు 38 దరఖాస్తులు, బుచ్చయ్యపేట మండలంలో 5 మద్యం దుకాణాలకు 51, కే కోటపాడు లో5కి 40, దేవరపల్లిలో4 కి 29 దరఖాస్తులు అందాయన్నారు.