హుకుంపేట మండలంలోని మారెల ఘాట్ రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. మూడు సంవత్సరాల క్రితం నిర్మించిన తారురోడ్డు శిథిలావస్థకు చేరి రాళ్లు తేలడంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదాలు తగ్గించేందుకు ఆర్అండ్బి అధికారులు తక్షణమే రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు.