నాతవరం: రైతులందరికీ ఓటు హక్కు కల్పించాలి
నీటి సంఘం ఎన్నికల్లో రైతులందరికీ ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ జిల్లా కన్వీనర్ లాలం వెంకటరమణారావు కోరారు. శుక్రవారం నాతవరం మండలంలోని ములగపూడి గ్రామంలో ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో జరిగే నీటి సంఘం ఎన్నికలకు సంబంధించి ఓటరు లిస్టులో చాలా మంది రైతుల పేర్లు లేవని ఇది అన్యాయమన్నారు. ఈ విషయాన్ని ఆర్డీవో, తహశీల్దార్ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని చెప్పారు.