నర్సీపట్నం: వచ్చే నెల14న జరిగే లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలి

51பார்த்தது
నర్సీపట్నం సీనియర్ సివిల్ జడ్జి పి. షియాజ్ ఖాన్ పోలీస్ అధికారులతో శనివారం సాయంత్రం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 14న జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న క్రిమినల్ కేసులను పరిష్కరించే విధంగా ప్రజలలో అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ మోహన్, టౌన్ సీఐ గోవిందరావు, రూరల్ సీఐ రేవతమ్మ, ఎస్ఐలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி