సంక్రాంతి పండుగ సందర్భంగా కొయ్యూరు గ్రామంలోని కోలాట భజన బృందం మహిళలకు స్థానిక గ్రామ పెద్ద, జీకేవీధి మండల తహసిల్దార్ కార్యాలయ రెవెన్యూ ఇన్స్పెక్టర్ దుమంతి సత్యనారాయణ దంపతులు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత తమ అందరిపైనా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని సంస్కృతి సంప్రదాయాలను పాటించాలన్నారు. పండుగల పేరుతో మన పూర్వీకులు అందజేసిన సాంప్రదాయాలకు విలువనిస్తూ వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని కలిగి ఉండాలని సూచించారు.