ముగ్గురు నిందితులు అరెస్ట్.. నగదు స్వాధీనం

3254பார்த்தது
చింతపల్లి రామాలయం వీధి లో ఇటీవల భారీ చోరీకి పాల్పడి ఆరు లక్షల 76 వేల నగదు అపహరించుకు వెళ్లిన నిందితులను చింతపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. చింతపల్లి సిఐ శ్రీనివాస్ అందజేసిన వివరాల ప్రకారం ఇటీవల చింతపల్లి రామాలయం వీధిలో ఇంట్లో చోరీ జరిగి భారీగా నగదు అపహరణకు గురైందని దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ కృష్ణారావు చింతపల్లి ఏఎస్పీ తుషార్ ధూడి ఆదేశాలతో దర్యాప్తు వేగవంతం చేశామన్నారు.

డాగ్ స్క్వాడ్ క్లూస్ టీం సీసీ పుటేజ్ ఆధారంగా వివరాలు సేకరించటం జరిగిందన్నారు. జిల్లా క్రైమ్ పోలీసులతో కలిసి చింతపల్లి అన్నవరం ఎస్ ఐ లు నిందితుల కోసం గాలింపు చర్యలను వేగవంతం చేయగా విశాఖ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో నిందితులు సంచరిస్తున్నట్లు గా సమాచారం అందిందన్నారు.

సోమవారం సాయంత్రం ముగ్గురు నిందితులైన సాయి, వెంకటేశ్వరరావు, మోహన్ ల ను చింతపల్లి సమీప అంతర్ల, పెంటపాడు వై జంక్షన్ వద్ద అదుపులోనికి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించామన్నారు. వారి వద్ద నుండి 6 లక్షల 70 వేల రూపాయల నగదు నాలుగు సెల్ ఫోన్ లు, ఆటో దొంగతనాలకు వినియోగించే పరికరాలను స్వాధీన పంచుకున్నట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు. త్వరితగతిన కేసును ఛేదించిన పోలీసులను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.

தொடர்புடைய செய்தி