పోర్టు హాస్పిటల్ వద్ద సంతకాలు సేకరణ
విశాఖ పోర్టు ఆస్పత్రిని ప్రైవేటుపరం చేయవద్దంటూ సీఐటీయూ జిల్లా కార్యదర్శి జగన్ ఆధ్వర్యంలో మంగళవారం సంతకాల సేకరణ చేపట్టారు. ఈమేరకు గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ వద్ద సంతకాలు సేకరించారు. కోవిడ్ తరువాత ప్రపంచంలోని ప్రైవేటు హాస్పిటల్స్ ను జాతీయం చేస్తుండగా. దీనికి భిన్నంగా పోర్టు ఆస్పత్రి ప్రైవేటు పరం చేయడం తగదన్నారు. ఇది దుర్మార్గమన్నారు.