విశాఖ సీతమ్మదారలోని సాంఘిక సంక్షేమ శాఖ బాయ్స్ హాస్టల్ - 2లో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేందిర ప్రసాద్ శనివారం తెలిపారు. హాస్టల్ సంక్షేమ అధికారి ఆర్. ప్రసాదరావును సస్పెండ్ చేస్తూ.. కాంట్రాక్ట్ ఉద్యోగి ఎం. అప్పారావును విధుల నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. బాయ్స్ హాస్టల్ లో మరుగుదొడ్లను శుభ్రపరిచేందుకు అక్కడ విద్యార్థులను వినియోగించినట్లు ఫిర్యాదు అందిందన్నారు.