ఎస్ కోట తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్, సహాయ ఎన్నికల అధికారి అరుణకుమారి ఆధ్వర్యంలో..ఎస్ఎస్ఆర్ 2025కు సంబంధించి ప్రచురణ చేసిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను మంగళవారం కార్యాలయ ఆవరణంలో ప్రదర్శించారు. సదరు జాబితాపై ఆక్షేపణలు ఉన్న యెడల ఫారం 6, 7, 8 ద్వారా తమ ఆక్షేపణలు తెలియజేయాలని కోరారు. నవంబర్ 28వ తేదీ లోపు తమ ఆక్షేపణలు తెలియజేయాలన్నారు.