శిశు మరణాలు జరగకుండా సమష్టి కృషి చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా వైద్యా ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె. విజయ పార్వతి అన్నారు. ఈ మేరకు శిశు మరణాలపై జిల్లా ఉప స్థాయి కమిటీ సమావేశాన్ని ఆరోగ్య శాఖ పార్వతీపురం పట్టణ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు జిల్లాలో జరిగిన శిశు మరణాలపై కమిటీ సమీక్ష జరిపారు.