శాసనసభ, శాసన మండలి చీఫ్ విప్, విప్‌లను ప్రభుత్వం నియమించింది. అసెంబ్లీలో ఒక చీఫ్ విప్, 15మంది విప్‌లు ఉండనున్నారు. శాసనసభలో చీఫ్ విప్‌గా జీవీ ఆంజనేయులుకు, మండలిలో చీఫ్ విప్‌గా అనురాధ నియమితులయ్యారు. అందులో భాగంగా మంగళవారం కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి కు శాసనసభ విప్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ శ్రేణులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.