గజపతినగరం: మాజీ మంత్రి అరుణ చే క్విక్ డోనర్ బ్రోచర్ ఆవిష్కరణ
విజయనగరం జిల్లా గజపతి నగరంలో మాజీ మంత్రి, జనసేన పార్టీ పిఎసి సభ్యురాలు పడాల అరుణ ఆదివారం క్విక్ డోనర్ బ్రోచర్ ను ఆవిష్కరించారు. అత్యవసర సమయంలో రక్తం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా మెంటాడ వారియర్ ఫౌండర్ దాసరి ప్రసాద్ క్విక్ డోనర్ యాప్ ను ఈనెల 25న ప్రారంభానికి సన్నాహాలు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మునకాల. జగన్, తాళ్లపూడి. సౌమిత్రి, త్రివేది, శివాజీ, అప్పలనాయుడు పాల్గొన్నారు.