ఉదయగిరి మండలం గంగిరెడ్డిపల్లి ఎంపీపీ పాఠశాలలో శుక్రవారం వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతిఒక్కరు మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు బాధ్యతగా వ్యవహరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, టిడిపి, జనసేన నాయకుడు పాల్గొన్నారు.