సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలం పెద్ద పాండూరు అరుణానది మీదుగా వెళ్లే రోడ్డు ఈ సంవత్సరం తుఫానుకు కొట్టుకొని పోయింది. అధికారులు గానీ, పాలకులు గానీ పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రస్తుత వర్షాలకు రోడ్డు గుంతలమయంగా మారినా తాత్కాలిక మరమ్మతులను చేయకపోవడం దారుణమని శనివారం స్థానికులు వాపోతున్నారు. ఈ మార్గంలో వెళ్లే పాదచారులు, వాహనదారులు పడుతున్న పాట్లు వర్ణనాతీతం.