పులిచెర్ల: టిడిపితోనే మైనార్టీల సంక్షేమం
టిడిపితోనే మైనార్టీల సంక్షేమం సాధ్యమవుతుందని పులిచెర్ల మండలం టిడిపి ఉపాధ్యక్షుడు ఇనయతుల్ల అన్నారు. పులిచెర్లలో శనివారం ఆయన మాట్లాడుతూ మైనార్టీ నాయకులు మహమ్మద్ షరీఫ్ ను రాష్ట్ర సలహాదారులుగా, ఏపీ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ గా ముస్తాక్ అహ్మద్ ను నియమించి ముస్లింలకు న్యాయం చేసినందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడుకు, మంత్రి నారా లోకేష్ కు, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు.