మదనపల్లిలో ఈనెల 14న నిర్వహించే మాదిగల ఆత్మీయ సదస్సు విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మురళి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శనివారం పుంగనూరు నియోజకవర్గం సదుం మండల కేంద్రం లో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ తీర్పు అనంతరం మొదటిసారిగా మదనపల్లికి వస్తున్న మందకృష్ణ మాదిగకు స్వాగతం పలకాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివయ్య, రామనాథం, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.