చిత్తూరు జిల్లా పుంగనూరు మండల సమీపంలోని చొక్కా వాండ్ల పల్లి గ్రామానికి చెందిన బోయకొండ కుమారుడు తరుణ్ (24) మనస్థాపం చెంది వ్యవసాయ పంట పొలాలకు వాడే పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు తరుణ్ ను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.