పుంగనూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గల ప్రధాన గేట్ వద్ద పెద్ద గుంతలలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి నీరు చేరిచిన్న చెరువును తలపిస్తున్నాయి. గురువారం సాయంత్రం బిజెపి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నరసింహులు మాట్లాడుతూ ఆర్టీసీ ఆవరణంలో ఏర్పడ్డ గుంతలకు వెంటనే అధికారులు మరమ్మత్తు చేయాలని కోరారు. గుంతల్లో నీరు నిల్వ కారణంగా ప్రయాణికులు రోగాల బారిన పడే అవకాశం ఉందని ఆయన అన్నారు.