పుంగనూరు: మైనర్లను పనిలో పెట్టుకుంటే చర్యలు తప్పవు

69பார்த்தது
పుంగనూరు: మైనర్లను పనిలో పెట్టుకుంటే చర్యలు తప్పవు
మైనర్లను పనిలో పెట్టుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని లేబర్ అధికారి ఆనంద్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం పుంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల, రొంపిచర్ల మండలాలలోని పలు దుకాణాలు, హోటల్లు, వెల్డింగ్ షాపులలో అధికారి తమ సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు చేశారు. అధికారి మాట్లాడుతూ. పెద్దలు పనికి వెళ్లాలని, పిల్లలు బడికి వెళ్లాలని తెలిపారు. అధికారుల నిబంధనలను పాటించకుంటే చర్యలు తప్పవని సూచించారు.

தொடர்புடைய செய்தி