గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి
ఉప్పలపాడు సమీపంలో శనివారం జరిగిన దుర్ఘటనలో తాపీ మేస్త్రీ షేక్ సత్తార్ (58) గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందారు. తెనాలి వైపు నుంచి వచ్చిన వాహనం ద్విచక్ర వాహనంపై ఉన్న సత్తార్‌ను బలంగా ఢీ కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ఎస్సై మిరాజ్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. దర్యాప్తు కొనసాగుతోంది.