రోడ్లపై చిరు వ్యాపారం చేసుకునే వారు ఆరోగ్యవంతమైన ఆహారం అందించాలని కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ సూచించారు. బుధవారం కుప్పం పట్టణంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రావుతో కలిసి చిరు వ్యాపారులు నిర్వహిస్తున్న పానీపూరి బండ్ల వద్ద ఆహార నాణ్యతను పరిశీలించారు. వారు వాడుతున్న ఆహార పదార్థాలు కాలం చెల్లినవా, లేక వినియోగంలో ఉన్న వస్తువులను వాడుతున్నారా లేదా అనే అంశంపై నేరుగా పరిశీలించారు.