చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే థామస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.