చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రభావతి దేవి ఆధ్వర్యంలో.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మంగళవారం మాత శిశు మరణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మొత్తం 2 మాతృ మరణాలు, 15 శిశు మరణాలపై సంబంధిత వైద్యాధికారులు, బంధు వర్గం, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు అంగన్వాడీ, ఆశ కార్యకర్తలతో మాతా శిశు మరణాల కారణాలపై ప్రత్యక్షంగా సమీక్షించారు.