పాతపట్నం మండల కేంద్రంలోని స్థానిక ఆంధ్ర ఒడిస్సా బోర్డర్ వద్ద ముమ్మరంగా తనిఖీలను నిర్వహించడం జరిగిందని సీఐ రామారావు తెలిపారు. బుధవారం సాయంత్రం జరిగిన ఈ తనిఖీలలో భాగంగా ప్రతి ఒక్క వాహనాన్ని నిశితంగా పరిశీలించడం జరిగిందని పేర్కొన్నారు. ఇటీవల గంజాయి రవాణా ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ఈ తనిఖీలను ముమ్మరం చేస్తున్నామని ఆయన వివరించారు. అలాగే అక్రమ మద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు.