మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పోలీసులకు డెడ్లైన్ విధించారు. పలాసలో ఆదివారం ఆయన మాట్లాడుతూ. 'మైనర్ బాలికపై అత్యాచారం చేసిన వారిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టాలని, వైసీపీ నేతలపై దాడి చేసిన వారిపై మర్డర్ కేసు నమోదు చేయాలన్నారు. ఆదివారం సాయంత్రంలోగా డిమాండ్ల నెరవేర్చకపోతే సోమవారం పోలీస్ స్టేషన్ ముట్టడించి పసుపు రంగు వేస్తాం' అని హెచ్చరించారు. జరుగుతున్న అరాచకాలపై పోలీసులు ఎందుకు స్పందించడం లేదంటూ నిలదీశారు.