యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ల జాబితాను కూటమి ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. జనసేన ఇచ్చాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి రాజును యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ గా రాష్ట్ర సర్కార్ నియమించింది. దీంతో ఆయనకు జనసేన సోంపేట మండల శ్రేణులు అభినందనలు తెలిపారు. ఎన్నికల వేళ దాసరి రాజు కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందని జనసైనికుడు బీన ప్రదీప్ అన్నారు.